News February 9, 2025
జిల్లాలో ప్రజావాణి రద్దు: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
Similar News
News April 18, 2026
నాడు శ్రీకాకుళం కలెక్టర్.. నేడు స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఉత్తమ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ చంద్ర పునేఠా నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. 1993-96 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి సీఎస్ స్థాయికి చేరారు. ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించింది.
News April 18, 2026
WGL: రూ.2.5 కోట్ల మోసం.. మిర్చి వ్యాపారి అరెస్ట్

ఏనుమాముల మార్కెట్‌లో అడ్తిదారులను మోసం చేసిన మిర్చి వ్యాపారి లడే తిరుపతిని పోలీసులు అరెస్టు చేశారు. గాయత్రి చిల్లీస్ పేరిట వ్యాపారం చేస్తూ 49 మందితో మిర్చి కొనుగోలు చేసి, అదే సరకును ఇతరులకు విక్రయించి సుమారు రూ.2.5 కోట్లతో పరారయ్యాడు. ఈ నెల 2న విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు. దేశాయిపేట వద్ద అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఆయన భార్య మాధవి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
News April 18, 2026
విశాఖలో ఒక్కరోజే 2,430 కేసులు నమోదు

విశాఖలోని శుక్రవారం ఒక్కరోజే 2,430 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,137, పిలియన్ రైడర్-223, ట్రిపుల్ రైడింగ్- 82, ఓవర్ స్పీడ్-220, సెల్ఫోన్ డ్రైవింగ్-28, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-15, మైనర్ డ్రైవింగ్ 03, రాంగ్ పార్కింగ్-180, డ్రంకన్ డ్రైవింగ్-35, సీజ్ అయిన వెహికల్స్-43, ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-547 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేయగా 20 బస్సులు తనిఖీ చేశారు.


