News February 9, 2025
కొయ్యూరు : ఇటుక తలపై జారి పడి బాలుడు మృతి

కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ కొత్త బొర్రంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మర్రి రాజుబాబు కుమారుడు భీమేశ్వరరావు(5)పై సిమెంటు ఇటుక పడి మృతి చెందినట్లు సమాచార హక్కు చట్టం జిల్లా కో ఆర్డినేటర్ మర్రి అర్జున్ రెడ్డి ఆదివారం తెలిపారు. బాలుడు గోడ పక్కన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇటుక జారి తలపై పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
Similar News
News February 25, 2026
NGKL: ఇంటర్మీడియట్ పరీక్షలకు 6,989 మంది హాజరు

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి.Telangana State Board of Intermediate Education ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి రోజు పరీక్షలకు మొత్తం7,265 మంది విద్యార్థులు కేటాయించగా,6,989మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,565 మందికి గాను 5,387 మంది, వొకేషనల్ విభాగంలో 1,700మందికి గాను 1,602మంది పరీక్షలకు హాజరైనట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ వెల్లడించారు.
News February 25, 2026
నెల్లూరు: 27న ట్రై స్కూటీల కోసం ఇంటర్వ్యూలు

ఈనెల 27న ట్రై స్కూటీల మంజూరుకు విభిన్న ప్రతిభావంతులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ మహమ్మద్ అయూబ్ తెలిపారు. జిల్లాలో ట్రై స్కూటర్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నెల్లూరులోని JC ఛాంబర్‌లో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
News February 25, 2026
జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రం తారుమారు

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్‌కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


