News February 9, 2025

ప్రిన్స్ హ్యారీ భార్యతో బాధలు పడుతున్నారు: ట్రంప్

image

అమెరికాలో స్థిరపడిన బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ దంపతులపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వలసదారుల్ని పంపించే కార్యక్రమంలో భాగంగా హ్యారీని కూడా దేశం నుంచి బయటికి తరలిస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ‘ఆయన ఆల్రెడీ భార్యతో తిప్పలు పడుతున్నాడు. అందువల్ల అతడ్ని వదిలేస్తున్నాను’ అంటూ బదులిచ్చారు. హ్యారీ భార్య మేఘన్‌కు, ట్రంప్‌‌కు ఒకరంటే ఒకరికి పడదు. పలుమార్లు తీవ్రంగా విమర్శించుకున్నారు.

Similar News

News January 15, 2026

ISS నుంచి స్టార్ట్ అయిన వ్యోమగాములు

image

ISS నుంచి నలుగురు వ్యోమగాములు ముందుగానే భూమికి తిరిగొస్తున్న <<18804760>>విషయం<<>> తెలిసిందే. ఒక వ్యోమగామికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారు భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 3:50కి స్టార్ట్ అయ్యారు. స్పేస్‌-X డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇద్దరు అమెరికన్‌, ఒక జపాన్‌, ఒక రష్యన్‌ వ్యోమగామి ప్రయాణిస్తున్నారు. 2:OO PMకి కాలిఫోర్నియాలోని పసిఫిక్‌ సముద్రంలో ల్యాండ్ కానున్నారు.

News January 15, 2026

మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

image

మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

News January 15, 2026

ఇకపై గ్రోక్‌లో బికినీ ఫొటోలు రావు!

image

AI చాట్‌బాట్ గ్రోక్ ద్వారా మహిళలు, పిల్లల ఫొటోలను అశ్లీలంగా మారుస్తున్నారన్న ఫిర్యాదులపై X స్పందించింది. ఇకపై వ్యక్తుల చిత్రాలను బికినీలు లేదా అసభ్య దుస్తుల్లోకి మార్చకుండా టెక్నికల్‌గా మార్పులు చేసింది. భారత ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, కాలిఫోర్నియాలో విచారణ ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను తొలగించి, 3500 పోస్టులను బ్లాక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.