News February 9, 2025

ఏలూరు పర్యటనలో మంత్రి కందుల

image

ఏలూరు పర్యటనకు తొలిసారిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయనకు పూల బొకే ఇచ్చి శాలువతో సత్కరించారు. అనంతరం అక్కడ నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు.

Similar News

News September 15, 2025

జూరాలకు ఇన్ ఫ్లో 78,013 క్యూసెక్కులు

image

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. సోమవారం ఉదయం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 78,013 క్యూసెక్కులు వస్తుంది. స్పిల్ వే గేట్ల ద్వారా 32,235 క్యూసెక్కులు, పవర్ హౌస్‌కు 41,513 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు నుంచి 74,344 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

News September 15, 2025

KMR: అత్యధిక వర్షపాతం ఎక్కడంటే!

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం వివరాలు.. సోమూరు 108మి.మీ, మేనూరు 89.5, డోంగ్లి 89.3, వెల్పుగొండ 42.8, తాడ్వాయి 42.5, లచ్చపేట 40, బొమ్మన్ దేవిపల్లి 39.5, బీబీపేట 28.3, భిక్కనూర్ 27, బీర్కూర్ 16.5, బిచ్కుంద 16.3, ఇసాయిపేట 14.3, పాత రాజంపేట 14, మాక్దూంపూర్ 12.3,సర్వాపూర్ 12, దోమకొండ 11.8మి.మీ లుగా నమోదయ్యాయి.

News September 15, 2025

ఆకివీడు తహశీల్దార్ నియామకంలో గందరగోళం!

image

ఆకివీడు రెవెన్యూ కార్యాలయంలో బదిలీల గందరగోళం ఏర్పడింది. తహశీల్దార్ వెంకటేశ్వరరావును కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ముందుగా ఆచంట డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరరావును ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే రోజు మళ్ళీ ఆదేశాలను రద్దు చేసి ఆకివీడు DT ఫరూక్‌కు బాధ్యతలిచ్చారు. MLA ఆదేశాలతోనే తొలుత ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేశారంటూ YCP శ్రేణులు ఆర్డర్ కాపీలను ట్రోల్ చేస్తున్నాయి.