News February 9, 2025
సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: DRO

ఈ నెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లు అధికారులకు అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ పాల్గొన్నారు.
Similar News
News March 18, 2026
కల్హేర్: ఉగాది స్పెషల్.. ఆ గ్రామాల్లో కుస్తీ పోటీలు

ఉగాది ఉత్సవాల్లో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. వారం రోజులపాటు సిర్గాపూర్, పోచాపూర్, మార్డి, బీబీపేట్, మంగల్ పేట్, సుల్తానాబాద్ గ్రామాల్లో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్లయోధులు కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు వస్తుంటారు.
News March 18, 2026
‘దివ్యాంగ శక్తికి’ సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి: కలెక్టర్

దివ్యాంగ శక్తి పథకాన్ని వినియోగించుకోవడానికి తప్పనిసరిగా సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. సదరం సర్టిఫికెట్లు లేనివారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పథకం ద్వారా దివ్యాంగులకు ఉచితంగాను వారితో పాటు వచ్చే ఎస్కార్ట్‌కు 50 శాతం రాయతీ ఇస్తున్నామన్నారు. దివ్యాంగులు ప్రయాణించేటప్పుడు సదరం సర్టిఫికెట్ నకళ్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
News March 18, 2026
కల్వకుర్తి: ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పరిశీలన: కలెక్టర్

కల్వకుర్తి పట్టణంలో నూతనంగా చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం పరిశీలించారు. పనులకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను త్వరితగతిన నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను డాక్టర్ శివరాం వివరించారు.


