News February 9, 2025

కామారెడ్డిలో సేవలు.. గుంటూరులో అవార్డు

image

కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డా.బాలు జాతీయ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. జయ జయ సాయి ట్రస్ట్ గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో MLA ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా డా.బాలు జాతీయ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఇప్పటి వరకు 75 సార్లు రక్తం దానం చేశారు. అంతేగాక తలసేమియాతో బాధపడుతున్న పిల్లల కోసం రక్తాన్ని సేకరించి అండగా నిలిచారు.

Similar News

News January 7, 2026

రాజకీయ ఉనికి కోసం గంటా పోరాటం(1/2)

image

భీమిలి MLA గంటా శ్రీనివాసరావు రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నారా? అనే చర్చ లోకల్‌గా నడుస్తోంది. గతంలో TDP ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే 2019-24 YCP హయాంలో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనను చీపురుపల్లికి పంపాలని అధిష్ఠానం భావించింది. చివరకు భీమిలి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గంటా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు.

News January 7, 2026

శ్రీకాకుళం: యువకుడిపై పోక్సో కేసు.. రిమాండ్

image

శ్రీకాకుళం నగరానికి చెందిన నవీన్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ హరికృష్ణ మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News January 7, 2026

రాజకీయ ఉనికి కోసం గంటా పోరాటం(2/2)

image

ఈ క్రమంలో జిల్లాలో గతంలో గంటాకు నడిచినంత హవా ఇప్పుడు లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటివరకు గంటా వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల తన సహజ శైలికి భిన్నంగా ప్రత్యర్థి పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వం దృష్టిలో పడేందుకు, వారసుడి ఎంట్రీ, రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.