News February 9, 2025

పిఠాపురం: పాదగయలో జేడీ లక్ష్మీ నారాయణ పూజలు

image

పిఠాపురం దక్షిణ కాశీగా పిలవబడే పాదగయ క్షేత్రంలో మాజీ ఐఏఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కుక్కుటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వరి అమ్మవారు పురుహుతి అమ్మవారి ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

Similar News

News March 5, 2026

SRCL: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేసి విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహశీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

News March 5, 2026

జూన్ 12 వరకు ఐదు దశల్లో ‘ప్రజా పాలన’: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్, వార్డు, పట్టణ ప్రణాళిక అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జూన్ 12 వరకు ఐదు దశల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు.

News March 5, 2026

కాకినాడలో 9న అప్రెంటిస్ మేళా

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని ఐటీఐ అభ్యర్థులకు సోమవారం అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వివిధ కంపెనీల్లోని ఖాళీలను ఈ మేళా ద్వారా భర్తీ చేస్తారు. ఐటీఐ పాస్ అయిన వారు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరు కావాలి. మరిన్ని వివరాలకు 9440408182 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు.