News March 19, 2024
వైజాగ్ అందాలు అద్భుతం: యూఎస్ రాయబారి

టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ వచ్చిన భారత్‌లో యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టీ దంపతులు మంగళవారం కైలాసగిరిని సందర్శించారు. అక్కడి నుంచి విశాఖ అందాలను చూసి మంత్ర ముగ్ధులై ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘కైలాసగిరి నుంచి వైజాగ్ అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత ప్రాంతాన్ని సంరక్షిస్తూ మరింత అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దిన GVMCకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
Similar News
News October 30, 2025
విశాఖలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణమిదే

భవనం నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వాలంటూ ముగ్గురు బెదిరిస్తున్నారని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ తన ఇంటిపై అదనపు అంతస్తు నిర్మిస్తుండగా ఇదే ప్రాంతానికి చెందిన నర్సింగరావు, అరుణ్ బాబు, శంకర్రావు బెదిరించడం వల్లే తాను అత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. దీంతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 30, 2025
విశాఖలో బెండకాయలు రూ.54

విశాఖ రైతు బజార్‌లలో కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం విడుదల చేశారు. వాటి వివరాలు (రూ.కిలో) టమాటా రూ.30, ఉల్లిపాయలు రూ.20/22, వంకాయలు రూ.40/44/54, బెండకాయ రూ.54, మిర్చి రూ.40, కాకరకాయ రూ.36, అనపకాయ రూ.26, క్యాబేజీ రూ.24, దొండ రూ.42, బీన్స్ రూ.66, పోటల్స్ రూ.62, చిలకడ రూ.30, కంద రూ.52, బద్ద చిక్కుడు రూ.66, తీపిగుమ్మిడి రూ.30, కరివేపాకు రూ.50, బీరకాయ రూ.46గా ఉన్నాయి.
News October 30, 2025
‘83 పునరావాస కేంద్రాల్లో 1516 మందికి ఆశ్రయం’

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 83 పునరాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో 1,516 మంది ఆశ్రయం పొందారు. ములగాడ మండలంలో 7 పునరావాస కేంద్రాల్లో 782 మంది ఆశ్రయం పొందారు. మహారాణిపేటలో 7 పునరావాస కేంద్రాల్లో అత్యధికంగా 520 మంది ఆశ్రయం పొందారు. సీతమ్మధార మండలంలోని 7 పునరావస కేంద్రాల్లో 82 మందికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.


