News February 9, 2025
సంగారెడ్డి: రేపు భౌతిక, రసాయన శాస్త్రం ప్రతిభా పరీక్ష

పదవ తరగతి విద్యార్థులకు భౌతిక, రసాయన శాస్త్రం జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష సంగారెడ్డిలోని సైన్స్ కేంద్రంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ప్రతిభా పరీక్షకు హాజరు కావాలని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో విజయం సాధించిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.
Similar News
News November 7, 2025
వనపర్తి: ‘బీజీలు సమర్పించిన మిల్లులకే ధాన్యం కేటాయింపు’

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు (బీజీ) సమర్పించిన రైస్ మిల్లులకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. అర్హత సాధించిన 80 మిల్లుల్లో కేవలం 18 మిల్లులు మాత్రమే బీజీలు సమర్పించాయని, మిగతా అర్హతగల మిల్లులన్నీ వెంటనే బీజీలు సమర్పించాలని ఆదేశించారు.
News November 7, 2025
చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.
News November 7, 2025
కాగజ్‌నగర్: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కుమురం భీం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సుంకరి సాయి క్రిష్ణ, వసాకే సాయికుమార్‌లు ఎన్నికయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ. 8,600 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజులు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.


