News February 9, 2025

KMR: జాతీయ సేవా పురస్కారం అందుకున్న జమీల్

image

ఓ వైపు విద్యా బుద్ధులు నేర్పుతూనే మరో వైపు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వ టీచర్, కామారెడ్డి రక్త దాతల సమూహం అధ్యక్షుడు జమీల్ జాతీయ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. జయజయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Similar News

News November 4, 2025

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది: శ్రీనివాస వర్మ

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలనుకునే ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం ఎందుకు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి డిసెంబర్‌లో శంకుస్థాపన జరగనున్నట్టు వెల్లడించారు. తాళ్లపాలెంలో NCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

News November 4, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 37,640 టిక్కీలు అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 40,415 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక ఓ ప్రకటనలో తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 37,640 అమ్మకం జరిగినట్లు చెప్పారు. ఇంకా యార్డు ఆవరణలో 7,834 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు రకాలుగా నమోదయ్యాయన్నారు.

News November 4, 2025

ఉండవెల్లి: ఆసుపత్రిలో మొదటి కాన్పు విజయవంతం

image

ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి మూడు నెలల క్రితం ప్రారంభమైన నిన్నటిదాకా ఒక కాన్పు కూడా జరగలేదు. ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున ఆడబిడ్డకు పురుడోసుకుంది. మండల కేంద్రానికి చెందిన సంధ్య పండంటి పాపకు జన్మనిచ్చినట్లు స్టాఫ్‌నర్స్ లత తెలిపారు. ఆసుపత్రిలో అనుభవంగల డాక్టర్లు, స్టాఫ్‌నర్స్‌లు ఉన్నారని, గర్భిణీలు నిశ్చింతగా కాన్పులకు రావచ్చన్నారు.