News February 9, 2025
నిజాంసాగర్ ప్రధాన కాలువలో వ్యక్తి గల్లంతు

నిజాంసాగర్ ప్రధాన కాలువలో ఒకరు గల్లంతు ఆయన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి మండలం అన్న సాగర్ గ్రామానికి చెందిన కర్రే విట్టల్ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతు అయ్యారు. దీంతో నీటి విడుదల నిలిపివేసి విట్టల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంత వరకు ఆచూకీ దొరకలేదు. నిజాంసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 19, 2026
ఒంగోలు: విధుల్లో గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పనిచేస్తున్న ఎక్సైజ్ కార్యాలయ కానిస్టేబుల్ కందుల రాఘవరావు విధుల్లో ఉండగా మృతి చెందారు. సెంట్రీ డ్యూటీలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు కాగా మృతదేహాన్ని అక్కడికి తరలించారు. ఐదు నెలల క్రితం ఈయన ఆత్మకూరుకు బదిలీపై వచ్చారు. ఆఫీసులోనే చనిపోవడంతో సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
News March 19, 2026
తొలి విడతలోనే అందరికీ రైతు భరోసా?

రైతు భరోసా పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విస్తీర్ణం ప్రాతిపదికన విడతల వారీగా కాకుండా ఈ నెల 22న ఒకే రోజు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాలని చూస్తోంది. రైతుకు ఎంత భూమి ఉన్నా తొలి విడతలో మొదటి ఎకరాకు ₹6,000 నగదును అకౌంట్లలో జమ చేస్తారని సమాచారం. మిగిలిన భూమికి 2, 3 విడతల్లో సాయం అందనుంది. ఎకరం లోపు ఉన్న వారికి ఎలాగూ తొలిరోజే పడుతుంది.
News March 19, 2026
IIT బెనారస్‌లో ఉద్యోగాలు

ఐఐటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ 5 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు మార్చి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/MTech/PhD, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నోడల్ ఆఫీసర్‌కు నెలకు రూ.లక్ష, రీసెర్చ్ ఇంజినీర్‌కు రూ.75K, డిజైన్ ఇంజినీర్‌కు రూ.55K, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.45K చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iitbhu.ac.in


