News February 9, 2025

ప్రకాశం జిల్లా ఎస్పీ కీలక సూచనలు

image

ఒంగోలులో ఆదివారం రైజ్ కళాశాల, టెక్ బుల్ సమస్థ అధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు హెల్మెట్  రక్షణ కవచం లాంటిదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు.  ఈ రన్‌లో పాల్గొన్న  ప్రజలకు క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపు నిచ్చారు.

Similar News

News March 12, 2025

గిద్దలూరు: రైలు ఎక్కి కరెంటు వైర్ పట్టుకున్న యువకుడు

image

గిద్దలూరులోని స్థానిక రైల్వే స్టేషన్‌లో బుధవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కాడు. అనంతరం పైన ఉన్న హై వోల్టేజ్ కరెంట్ వైర్‌ను పట్టుకున్నాడు. దీంతో షాక్ తగిలి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

News March 12, 2025

ప్రకాశం జిల్లాకు 57 నూతన ప్రభుత్వ పాఠశాలలు

image

ప్రకాశం జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 57 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను నెలకొల్పుతున్నట్లుగా, విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా జిల్లా కలెక్టర్ వాటిని ఆమోదించారు. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు నివేదికను తీసుకొని ఎక్కడెక్కడ పాఠశాలలను నెలకొల్పాలో, ఓ అంచనాతో విద్యాశాఖ నివేదిక రూపంలో వాటిని అధికారులకు సమర్పించనున్నారు.

News March 12, 2025

ఒంగోలు: ‘భూముల పున పరిశీలన పటిష్టంగా చేపట్టాలి’

image

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన పటిష్టంగా చేపట్టాలని సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుంచి ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ.. నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తిస్థాయిలో పరిశీలన జరగాలన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.

error: Content is protected !!