News February 9, 2025
కలిసి పోటీ చేస్తే ఫలితం వేరేలా ఉండేది: రౌత్

అసెంబ్లీ సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం లేకనే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయని శివసేన(UBT) ఎంపీ సంజయ్‌రౌత్ అన్నారు. కలిసి పోటీచేస్తే ఫలితం వేరేలా ఉండేదన్నారు. ఇండియా కూటమిలో అంతర్గత కలహాలు బీజేపీకి లాభం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీని ఎదుర్కోవాలంటే పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని చెప్పారు. ఇండియా అలయెన్స్ ప్రస్తుతం ఉందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తెలిపారు.
Similar News
News March 8, 2026
CA ఫలితాలు విడుదల

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్‌ను <
News March 8, 2026
ఈ వారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ వారం(మార్చి 2-8) బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.6,870, తగ్గి రూ.1,63,640గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.6,300 పడిపోయి రూ.1,50,000 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ ధర రూ.25వేలు తగ్గి రూ.2,90,000లకు చేరింది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతాయని భావించినా అనూహ్యంగా తగ్గడం గమనార్హం.
News March 8, 2026
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు.. ఆదేశాలు జారీ

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. అధికారులు 200 గజాల స్థలాన్ని గుర్తించి నెలాఖరులోగా శంకుస్థాపన చేయాలని ఆదేశించింది. ఒక్కో భవనాన్ని ₹10L ఉపాధి హామీ నిధులతో నిర్మించాలని సూచించింది. సమావేశాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు ఇవి ఉపయోగపడనున్నాయి. కాగా డ్వాక్రా సంఘాల్లో 63L మంది సభ్యులున్నారు.


