News February 9, 2025

బెల్లంపల్లి: అంకుశం వైపు పులి కదలికలు

image

గత 11రోజులుగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి అడుగులను ఆదివారం ఉదయం బుగ్గ శివాలయం ఆలయం ప్రాంతంలో గుర్తించినట్లు అటవీశాఖాధికారి పూర్ణచందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..బుగ్గ ఆలయం గుట్ట నుంచి అంకుశం గ్రామం వైపు పులి వెళ్లినట్లుగా ఆనవాళ్లు కనుక్కున్నామన్నారు. రెండు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Similar News

News March 28, 2026

NZB: ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలి: కలెక్టర్

image

ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా, వారికి జవాబుదారీగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. శనివారం జరిగిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్పొరేటర్లు ప్రస్తావించే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించి, పరిష్కారం చూపేందుకు నెల రోజుల లోపే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్నారు.

News March 28, 2026

‘వయాగ్రా’: ఏదో అనుకుంటే మరేదో అయ్యిందే..!

image

కొన్నిసార్లు ఒక వ్యాధి కోసం తయారుచేసిన మెడిసిన్ మరొకదానికి పనిచేయొచ్చు. అలాంటిదే ‘ఫైజర్’ సంస్థ 1990ల్లో తయారుచేసిన ‘సిల్డెనాఫిల్’. గుండె సంబంధిత చికిత్స కోసం దీనిని రూపొందించారు. అయితే క్లినికల్ ట్రయల్స్‌లో రోగులకు అంగస్తంభన కలగడం అనే ఊహించని సైడ్ ఎఫెక్ట్‌ను గుర్తించారు. ఇది వైద్య చరిత్రలో అతిపెద్ద మలుపుగా మారి ‘వయాగ్రా’గా ప్రసిద్ధి చెందింది. వైద్యరంగంలో ఇదొక ‘యాదృచ్ఛిక ఆవిష్కరణ’గా నిలిచిపోయింది.

News March 28, 2026

మాచర్ల: APRDC సెట్ గడువు పొడిగింపు

image

నాగార్జునసాగర్‌లోని ఏపీఆర్డీసీ డిగ్రీ కళాశాల ప్రవేశ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. నయీమ్ భాను తెలిపారు. ఏప్రిల్ 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీల్లోని వివిధ నూతన కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.