News February 9, 2025
రేపు నిర్మల్‌లో పర్యటించనున్న త్రిపుర గవర్నర్

త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు నిర్మల్ చేరుకొని అక్కడి నుంచి మంజులాపూర్‌లో గల ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళనున్నారు.
Similar News
News March 16, 2026
కడప: ‘ఓపెన్ 10th పరీక్షలకు 22 స్క్వాడ్లు ఏర్పాటు’

కడప జిల్లాలో ఓపెన్ 10th పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ నివారణకు 22 స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడపలో ఆదివారం 10th పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. 2,424 మంది విద్యార్థులు ఓపెన్ 10th పరీక్షలను 31 కేంద్రాల్లో రాయనున్నారు. పటిష్ఠంగా పరీక్షల నిర్వహణ కోసం 6 ఫ్లయింగ్, 16 సిట్టింగ్ స్క్వాడ్లు, 31 చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించామన్నారు.
News March 16, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 16, 2026
‘ఆపరేషన్ లోటస్’కు BJP తెరలేపింది: DK శివకుమార్

రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఇది బీజేపీ ఆపరేషన్ లోటస్‌లో భాగమన్నారు. క్రాస్ ఓటింగ్ చేయాలని నలుగురు వ్యక్తులు తమ ఎమ్మెల్యేలను కాంటాక్ట్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.


