News February 9, 2025

గాజా నుంచి ఇజ్రాయెల్ సేనల ఉపసంహరణ

image

హమాస్‌తో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా నుంచి తమ బలగాల ఉపసంహరణను ప్రారంభించామని ఇజ్రాయెల్ తెలిపింది. ప్రస్తుతం నెట్‌జరీమ్ కారిడార్ నుంచి సైనిక ఉపసంహరణ జరుగుతోందని పేర్కొంది. మొత్తం 42 రోజుల పాటు ఈ సీజ్‌ఫైర్ అమల్లో ఉండనుంది. అటు హమాస్ మరింతమంది ఇజ్రాయెల్ పౌరుల్ని విడుదల చేస్తే ఇటు ఇజ్రాయెల్ మరింత సైన్యాన్ని తరలించి సీజ్‌ఫైర్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

Similar News

News March 6, 2026

H1-B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

image

FY 2027కి సంబంధించిన H1-B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు గడువు ఉంది. అయితే ఈసారి అమెరికా నిబంధనలను చాలా కఠినం చేసింది. విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకునే కంపెనీలు లక్ష డాలర్ల అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో కూడా ఎక్కువ శాలరీ, నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యం లభించేలా ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతి తెచ్చారు. సోషల్ మీడియా వెరిఫికేషన్ కూడా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

News March 6, 2026

నేపాల్.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన బాలేంద్ర షా పార్టీ

image

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 90కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. నేపాల్‌లో 275 స్థానాలు ఉండగా 165 స్థానాలకు ప్రజల ఓటింగ్ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మిగిలిన 110 సీట్లను రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. 165 సీట్లలో 84 గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.

News March 6, 2026

T20 ఫ్రాంచైజీని కొంటున్న ద్రవిడ్, అశ్విన్

image

యురోపియన్ T20 ప్రీమియర్ లీగ్‌లో భారత మాజీ క్రికెటర్లు ద్రవిడ్, అశ్విన్ భాగం కాబోతున్నారు. గ్లాస్గో ఫ్రాంచైజీని ఇండియాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపుతో కలిసి వారు కొనుగోలు చేయనున్నారని BBC Sport తెలిపింది. అందులోనే డచ్ ఫ్రాంచైజీని సౌతాఫ్రికా ఇన్వెస్టర్లు కొననున్నట్లు వెల్లడించింది. దీనిలో డుప్లెసిస్, క్లాసెన్, జాంటీ రోడ్స్ ఇన్వెస్టర్లుగా ఉన్నారు. 6 జట్లు ఉండే ఈ లీగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.