News February 9, 2025
రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ: కలెక్టర్

ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను వేయాలని సూచించారు. ఏదైన కారణాతలో హాజరు కాని వారికి 17న మరోసారి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News January 15, 2026
ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.
News January 15, 2026
నల్గొండలో ఇక నవ శకం!

నల్గొండను నగరపాలక సంస్థగా మార్చడంతో పాలనలో కొత్త శకం ప్రారంభంకానుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నల్లగొండ మునిసిపాలిటీగా కొనసాగగా, ఇకపై కార్పొరేషన్‌గా కొనసాగుతుంది. కార్పొరేషన్ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. నగర ప్రథమ పౌరుడిగా మేయర్ కొనసాగుతారు. రాజకీయంగా మేయర్ పదవికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. మంత్రులతో సరిసమానమైన ప్రోటోకాల్ ఉంటుంది.
News January 15, 2026
NLG: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్రం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓ పక్క సర్వర్ మొరాయింపు.. ఇంకోపక్క వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం.. మరోవైపు అవగాహన లేమి.. వెరసి పంటల ఆన్లైన్ నమోదుకు అడ్డంకిగా మారాయి. జిల్లాలో 5,65,782 మంది రైతులకు గాను ఇప్పటివరకు 30,953 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3,34,953 మంది రైతులు రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉన్నారు.


