News March 19, 2024
వేసవిలో తాగునీటి కొరత లేదు: సీఎస్
TG: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతి కుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వేసవి కాలంలో తాగునీటి కొరత లేదని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ సరిపడా నీటి సరఫరా జరుగుతోందని, ఎవరైనా కోరితే అదనపు వాటర్ ట్యాంకులు పంపిస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News November 5, 2024
బరాక్ ఒబామాకు సిద్ద రామయ్య ఆహ్వానం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు CM సిద్ద రామయ్య ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు. 1924లో బెలగావిలో జరిగిన 39వ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వచ్చే నెల బెలగావిలో శతాబ్ది ఉత్సవాలతోపాటు శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఒబామాను సిద్ద రామయ్య కోరారు.
News November 5, 2024
పెళ్లి కుదర్చలేదని మ్యాట్రిమోనీ సైట్‌కు రూ.60వేలు ఫైన్!
బెంగళూరులో దిల్మిల్ మ్యాట్రిమోనీ సైట్ ఓ వ్యక్తికి పెళ్లి కుదర్చలేకపోయినందుకు కన్జూమర్ కోర్టు ₹60వేల ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని సదరు కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశించింది. తన కొడుక్కి 45రోజుల్లో మ్యాచ్ కుదుర్చుతామని హామీ ఇవ్వడంతో ఓ కస్టమర్ ₹30వేలు చెల్లించాడు. రోజులు గడుస్తున్నా ఒక్క మ్యాచ్ కూడా కుదర్చలేదు. దీంతో తన అమౌంట్ రీఫండ్ చేయాలని అతడు కమిషన్‌ను ఆశ్రయించాడు. ఫలితంగా ఈ తీర్పు వచ్చింది.
News November 5, 2024
రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై పవన్ వివరించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా చర్చించే అవకాశం ఉంది. సమావేశం అనంతరం రేపు రాత్రి రాష్ట్రానికి తిరుగుపయనం కానున్నట్లు సమాచారం. కాగా హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.