News February 9, 2025
UP వారియర్స్ కెప్టెన్‌గా దీప్తి శర్మ

WPLలో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ఆ ఫ్రాంచైజీ నియమించింది. గత సీజన్‌లో దీప్తి ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 27 ఏళ్ల దీప్తి భారత్ తరఫున 124 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. WPLలో 17 మ్యాచులు ఆడి 385 పరుగులు, 19 వికెట్లు సాధించారు.
Similar News
News November 6, 2025
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News November 6, 2025
ఇతిహాసాలు క్విజ్ – 58

1. ధృతరాష్ట్రుడి రథసారథి ఎవరు?
2. కంసుడి తండ్రి ఎవరు?
3. శశాంకుడు అంటే ఎవరు?
4. విశ్వకర్మ పుత్రిక ఎవరు?
5. తెలుగు సంవత్సరాలు ఎన్ని?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 6, 2025
ఏపీలోని ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి: తుమ్మల

TG: ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెంను తిరిగి విలీనం చేయాలని కోరారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం.


