News February 9, 2025

తాండూర్‌కు వాసి డా.జయప్రసాద్‌కు ఉత్తమ అవార్డు

image

తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డా.జయప్రసాద్(జనరల్ సర్జన్)కు మరోసారి ఉత్తమ అవార్డు దక్కింది. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ వైద్యుడిగా అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ డా.జయప్రసాద్‌కు ఉత్తమ అవార్డును అందజేశారు. 

Similar News

News March 21, 2026

HYD: ‘హోమియో’కు పెరుగుతున్న ఆదరణ

image

తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ అయిన హోమియోపతి రామంతపూర్‌ ఆస్పత్రికి రోజురోజుకూ ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 700 మంది వరకు రోగులు చికిత్స కోసం ఆస్పత్రిని సందర్శిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజల్లో హోమియో వైద్యం పట్ల విశ్వాసం పెరుగుతుండటంతో ఈ సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఉ.10:30 గం. నుంచి సా.5:30 వరకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.

News March 21, 2026

పోలవరం: గేదె దూడను హతమార్చిన పెద్దపులి

image

పోలవరం జిల్లా సరిహద్దు గ్రామమైన ఏలేశ్వరం మండలం మర్రివీడు శివారున శనివారం తెల్లవారుజామున ఒక గేదె దూడను పెద్ద పులి హత మార్చింది. గ్రామానికి చెందిన అనుసరి రాంబాబు పశువుల కొట్టంపై దాడి చేసి ఒక గేదె దూడను చంపి కొంత దూరం తీసుకుపోయిందని గ్రామస్తులు చెప్పారు. పులి రూటు మార్చుకొని మళ్లీ యథాస్థానం ఏలేరు ప్రాజెక్టు ప్రాంతానికి చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

News March 21, 2026

రైళ్లలో చోరీలు.. విశాఖలో కాకినాడ వాసి అరెస్టు

image

రన్నింగ్ ట్రైన్స్‌లో ల్యాప్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్.ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్‌లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్‌టాప్‌లు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన చెప్పారు.