News February 9, 2025
హిందూపురం విద్యార్థుల ప్రతిభ

హిందూపురం పట్టణంలోని డీబీ కాలనీ అబాకస్ కాన్సెప్ట్ కేంద్ర విద్యార్థులు కిడ్స్ కాన్సెప్ట్ జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బెంగళూరులో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో 31 మంది పాల్గొనగా.. అందులో 25 మందికి జాతీయస్థాయి బహుమతులు వచ్చాయి. జాతీయస్థాయి కిడ్స్ కాన్సెప్ట్ పోటీల నిర్వాహకులు సచిన్ రావు నుంచి అబాకస్ కేంద్ర నిర్వాహకురాలు శృతి రేచల్ బెస్ట్ ఫ్రాంచెస్ అవార్డు అందుకున్నారు.
Similar News
News April 2, 2026
గూడూరులో ROB పూర్తి చేయండి: MP

గూడూరులో పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఫైఓవర్ పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్నను కోరారు. 2008 నుంచి పనులు నిలిచిపోవడంతో గూడూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట స్టేషన్ల పరిధిలో ముఖ్య రైళ్లకు స్టాపింగ్‌లు ఇవ్వాలని కోరారు. తన వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
News April 2, 2026
ఏలూరు: ఆయన సర్వీస్ అంతా దాడులే..!

బుట్టాయగూడెం <<19544691>>ఎస్‌ఐ <<>>ఉమామహేశ్వరరావు బాధ్యతారహిత వైఖరిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ద్వారకాతిరుమల, ధర్మాజిగూడెంలలో ప్రజలపై దాడులు చేసి గ్రామస్థుల నిర్బంధానికి గురైన ఆయన, తాజాగా లక్కవరంలోనూ అదే తీరును ప్రదర్శించారు. ఎస్‌ఐ వేధింపులతో విసుగెత్తిన ప్రజలు ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడం కలకలం రేపింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన అధికారి దాడులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
News April 2, 2026
నిజామాబాద్: ‘మీ సేవ’ వాత.. భారీగా పెరిగిన ధరలు!

జిల్లాలో మీ సేవ సేవల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ప్రభుత్వం యూజర్ ఛార్జీలను 50% పెంచి, దానికి 18% జీఎస్టీని చేర్చడంతో మొత్తం 68% భారం పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరలతో రూ.35 ఉన్న ‘A’ కేటగిరీ సేవలు రూ.62కు, రూ.45 ఉన్న ‘B’ కేటగిరీ (కుల, ఆదాయ ధృవీకరణ) ధరలు రూ.80కి చేరాయి. జిల్లాలోని 250 కేంద్రాల్లో నిత్యం సేవలు పొందే ప్రజలు ఈ పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


