News February 9, 2025
బాపట్ల: ‘ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలి’

19 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని బాపట్ల జిల్లా వైద్యశాఖ అధికారి విజయమ్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈనెల 10న జాతీయ నులిపురుగులు దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు అందించాలన్నారు. నులిపురుగుల వల్ల శరీరంలో రక్తహీనత, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు.
Similar News
News January 15, 2026
17న కాకినాడకు సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 17వ తేదీ శనివారం కాకినాడలో పర్యటించనున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి బీచ్ రోడ్డులోని గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ప్రజాప్రతినిధులతో సమావేశమై చర్చిస్తారు. పర్యటన ముగించుకుని సాయంత్రం తిరిగి ఉండవల్లి చేరుకుంటారు. CM పర్యటన నిమిత్తం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
News January 15, 2026
ప.గో: ఈ కోడికి క్రేజ్ మామూలుగా లేదుగా..!

గోదావరి జిల్లాలో సంక్రాంతి బరుల్లో ‘కోజా’కు భలే గిరాకీ ఏర్పడింది. చిన్ననాటి నుంచి ప్రత్యేక పౌష్టికాహారంతో పెంచడంతో.. ఈ మాంసానికి ప్రియుల నుంచి విశేష డిమాండ్ ఉంది. బరువును బట్టి వేల రూపాయలు పలికే ఈ కోజాలను పందెం విజేతలు విక్రయిస్తుండగా.. మరికొందరు ప్రముఖులకు, అధికారులకు విందు కోసం కానుకగా పంపిస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పుంజులకు క్రేజ్ తగ్గకపోవడం విశేషం.
News January 15, 2026
స్పైస్ బోర్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP: గుంటూరులోని స్పైస్ బోర్డ్ 3 SRD ట్రైనీస్, ట్రైనీ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. బీఎస్సీ అర్హత గల వారు ఫిబ్రవరి 4న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు జీతం రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.indianspices.com


