News February 9, 2025

త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదు: గొట్టిపాటి

image

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలులో ఆదివారం జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, స్వామి, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 30, 2025

ప్రకాశం: నేడు కూడా పాఠశాలలకు సెలవు

image

ప్రకాశం జిల్లాలోని వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా అన్ని పాఠశాలలకు సెలవులు మంజూరు చేస్తూ డీఈవో కిరణ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని డీఈవో తెలిపారు. ఇప్పటికే తుఫాన్ నేపథ్యంలో 3 రోజులపాటు సెలవు ప్రకటించగా.. తాజాగా మరొక రోజును పొడిగించినట్లు, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.

News October 30, 2025

ప్రకాశం: UG పరీక్షలు వాయిదా

image

మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు జరగాల్సిన గ్రాడ్యుయేట్ (UG) 3, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటిని తిరిగి నవంబర్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. డీవీఆర్ మూర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 29, 2025

ఒంగోలు: హైవేపైకి నీరు.. రాకపోకలకు అంతరాయం

image

భారీ వర్షాలకు గుండ్లకమ్మ డ్యాం నిండింది. జలాశయానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది. మొత్తం 16 గేట్లు ఉండగా అధికారులు 15 గేట్లు ఎత్తి 1.50లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మద్దిరాలపాడు సమీపంలో హైవే బ్రిడ్జిపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. NDRF సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు మొదలు పెట్టారు. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.