News February 9, 2025
రేపు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

నంద్యాలలోని కలెక్టరేట్‌లో ఈనెల 10వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. ప్రజలు కూడా తమ సమస్యలపై అర్జీలు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News November 17, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్‌లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్‌ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 17, 2025
సిద్దిపేట: ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్న NRI కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మృతులకు ప్రగాడ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఉంటామని హామీనిచ్చారు.
News November 17, 2025
తూ.గో: ఆశాజనకంగా ఆయిల్ ఫామ్ సాగు

తూ.గో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఎకరా సాగుకు పెట్టుబడి పోను రూ.1.50 లక్షలు ఆదాయం లభిస్తోందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో టన్ రూ.19,636 పలుకుతుంది. రూ.16 వేలు పైబడి ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట రూ.23 వేలు పైబడి ధర లభించింది. జిల్లా వ్యాప్తంగా 48,992 ఎకరాల్లో సాగవుతోందని ఉద్యాన అధికారి ఎన్. మల్లికార్జునరావు తెలిపారు.


