News February 9, 2025

కిరణ్ రాయల్ వివాదానికి ఆ ఫొటోనే కారణమా?

image

తిరుపతి జనసేన ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వివాదానికి రెండు రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్‌లో జగన్ 2.0 పోస్టర్‌ను రిలీజ్ చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఫొటోతో మాజీ ముఖ్యమంత్రి హేళన చేయడం సహించలేని వైసీపీ నాయకులు కిరణ్ రాయల్ ఫోన్ గతంలో గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ క్రమంలోనే ఆయన డేటాను అటు మీడియాకు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

Similar News

News October 26, 2025

ఏపీలో నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా

image

AP: రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా పడింది. ఎల్లుండి అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకులకు శంకుస్థాపన చేసేందుకు ఆమె రేపు రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ మొంథా తుఫాన్ కారణంగా మంత్రి పర్యటన వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

News October 26, 2025

సిరిసిల్ల: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికో.. ?

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మద్యం పాలసీ 2025-27కు ఎక్సైజ్ అధికారులు రేపు డ్రా తీయనున్నారు. జిల్లాలోని మొత్తం 48 దుకాణాలకు 1,381 దరఖాస్తులు వచ్చాయని, దీంతో రూ.41.43 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. జిల్లెల వైన్స్‌కు అత్యధికంగా 53 దరఖాస్తులు రాగా, రుద్రంగి వైన్స్‌కు అత్యల్పంగా 15 దరఖాస్తులు వచ్చాయి. రేపటి లక్కీ డ్రాలో టెండర్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.

News October 26, 2025

నెల్లూరు: గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి సర్వే

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా ఆదేశాలతో మనుబోలు మండలం- పల్లిపాలెం గ్రామంలో గిరిజనుల ఇళ్ల నిర్మాణం కోసం ఆదివారం హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు తమకు ఇల్లు లేవని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్వేచేసి అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని హౌసింగ్ ఏఈ శరత్‌బాబు తెలిపారు.