News February 9, 2025
MHBD: రేపు కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి(గ్రీవెన్స్ సెల్)ని రేపు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఎమ్మెల్సీ కోడ్, ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజల సౌకర్యార్థం వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 6, 2026
బుమ్రా@500 వికెట్లు

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు తీశారు. ఇవాళ సెమీఫైనల్లో ENG కెప్టెన్ బ్రూక్‌ను ఔట్ చేసి ఈ క్లబ్బులో చేరారు. 2016లో అరంగేట్రం చేసిన బుమ్రా 235 మ్యాచులు ఆడారు. 18 సార్లు 5 వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఆ లెజెండరీ బౌలర్ 401 మ్యాచుల్లో 953 వికెట్లు పడగొట్టారు.
News March 6, 2026
విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఎంతంటే?

విజయ్ దేవరకొండ-రష్మిక తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో 4 రోజుల వేడుకల నుంచి హైదరాబాద్‌లో రిసెప్షన్‌కు వరకు రూ.15-20 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి కోసం 3 కేజీల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు టాక్. వివాహ బాధ్యతను ఓ ప్రైవేట్ ఈవెంట్ సంస్థ చూసుకోగా, వీరి పెళ్లి వీడియోను నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News March 5, 2026
వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాలు.. ఏదుల నుంచి సంత/కూరగాయల మార్కెట్ ముగించుకొని 12 మందితో వెళ్తున్న ఆటో, రేవల్లి నుంచి వనపర్తికి వెళ్తున్న వరి పొట్టు ట్రాక్టర్ రెండు ఢీన్నాయి. ఈ ఘటనలో ఆటోలోని వెంకటయ్య(50) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను రేవల్లి, కోడేరు, పానగల్ అంబులెన్స్ ద్వారా వనపర్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు. మార్గమధ్యలో సుమిత్ర(42) చనిపోయారు.


