News February 9, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో TOP NEWS

image

* పదవ తరగతి విద్యార్థిని సూసైడ్ *మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేటీఆర్‌కు వినతి * జాతరకు ముస్తాబవుతున్న ఆలయాలు* సిర్పూర్‌ను మహారాష్ట్రలో కలపమన్నారు: కేటీఆర్ * సైబర్ నేరాల పై అవగాహన కలిగి ఉండాలి: జైనూరు సీఐ* కెరమెరిలో నైట్ పెట్రోలింగ్ చేసిన ఎఫ్ఆర్ఓ

Similar News

News September 18, 2025

విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

image

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.

News September 18, 2025

శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా రమేశ్ నాయుడు

image

శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా పోతుగుంట రమేశ్ నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బీజేపీలో కీలక నేతగా ఉన్న రమేశ్ నాయుడును నంద్యాల జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించడం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 18, 2025

VJA: వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ

image

SRR & CVR కళాశాలలో వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణలో వెబ్‌సైట్ రూపకల్పనపై శిక్షణ ఇస్తామని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు దీనికి హాజరు కావొచ్చన్నారు. వివరాలకై APSSDC ట్రైనింగ్ కో ఆర్డినేషన్ అధికారి నరేశ్‌ను సంప్రదించాలని కోరారు.