News March 19, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు 

image

✓రాజేంద్రనగర్ యూనివర్సిటీలో ఫొటోగ్రఫీ పై నైపుణ్య శిక్షణ
✓ఉప్పల్:రియల్ ఎస్టేట్ పేరుతో మోసం.. బాధితుల ఆందోళన
✓మ్యాన్‌హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్
✓ఓయూ పీఎస్ పరిధిలో పల్టీ కొట్టిన కారు.. ఒకరి మృతి
✓నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా ARREST ✓చందానగర్‌లో కారులో మంటలు
✓జీడిమెట్ల‌లో 9వ అంతస్తు నుంచి పడి ఒకరి మృతి
✓కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచి, అభివృద్ధి చేస్తా: రంజిత్ రెడ్డి

Similar News

News February 16, 2026

BREAKING: కడ్తాల్ వద్ద రెండు కార్లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

image

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. NH 765పై రెండు కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లలో ప్రయాణిస్తున్న నరేంద్ర చారి (37), ఎస్‌కే సైదులు (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2026

BREAKING: రంగారెడ్డిలో హోరాహోరి.. ఫలితాలు ఇవే!

image

రంగారెడ్డిలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, BRS హోరాహోరీగా నిలిచాయి. మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 54 కాంగ్రెస్, 47 బీఆర్ఎస్, 16 బీజేపీ, 9 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఆమన్‌గల్‌ BRS, ఇబ్రహీంపట్నం BRS, షాద్‌నగర్ INC, శంకర్‌పల్లి INC, చేవెళ్లలో INC సత్తాచాటాయి. మొయినాబాద్‌ ఒక్క చోట హంగ్ ఏర్పడింది. అటు మేడ్చల్‌లోని అలియాబాద్‌ మున్సిపాలిటీలోనూ హంగ్ వచ్చింది.