News February 9, 2025

ఏటూరునాగారం: రేపటి ఐటీడీఏ గిరిజన దర్బారు రద్దు

image

ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలో రేపు (సోమవారం) జరగనున్న గిరిజన దర్బారు రద్దు చేసినట్లు పీవో చిత్రమిశ్రా ఆదివారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున గిరిజన దర్బారు నిర్వహించడం లేదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు ఈ విషయాన్ని గమనించాలని పీవో కోరారు. దరఖాస్తులతో ఐటీడీఏకి రావద్దని సూచించారు.

Similar News

News March 16, 2026

ఆస్కార్‌ అవార్డు‌ను అమ్ముకోవచ్చా.. దాని విలువెంత?

image

ఆస్కార్ అవార్డు గ్రహీతలకు ట్రోఫీ తప్ప ప్రత్యేకంగా నగదు బహుమతి అంటూ ఏమీ ఇవ్వరు. ఒక్కో ట్రోఫీ తయారీకి 400 డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే విజేతలు తమకు వచ్చిన బహుమతిని విక్రయించేందుకు వీలులేదు. అకాడమీకి 1 డాలర్‌‌కు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. 1951లో ఈ రూల్ తెచ్చారు. 1950కి ముందు ఇచ్చిన అవార్డులకు ఇది వర్తించదు. ఓ ఆస్కార్ అవార్డు అధికారిక విలువ $1 అయినా.. అది తెచ్చిపెట్టే ప్రతిష్ఠ ఎనలేనిది. ఏమంటారు?

News March 16, 2026

పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

image

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.

News March 16, 2026

జింకు ఫాస్పేట్‌ ఎరతో ఎలుకల నివారణ

image

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.