News February 9, 2025
సంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మాస్టర్ ట్రేడర్ కళింగ కృష్ణకుమార్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని డిఆర్ఓ పద్మజ రాణి తెలిపారు.
Similar News
News March 14, 2025
కాటారం: అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ

కాటారం శివారులో చింతకాని క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గతరాత్రి లారీ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. నిద్రమత్తులో లారీని డివైడర్ పైకి ఎక్కించినట్లు స్థానికులు తెలిపారు. ఎదురుగా ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం ధ్వంసమైంది.
News March 14, 2025
IPL-2025లో కెప్టెన్లు

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్
News March 14, 2025
MBNR: రెండు బైకులు ఢీ.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం సీసీ కుంట మండల పరిధిలో చోటు చేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. పార్దిపూర్ గ్రామానికి చెందిన రాజు (31) నిన్న సాయంత్రం బైక్‌పై లాల్ కోట వైపు వెళ్తున్నాడు. పర్దిపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న రమేష్ నాయక్ బైక్ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొనగా రాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్‌కు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.