News February 9, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ప్రజావాణి కార్యక్రమం వాయిదా
> జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటిన స్టేషన్ ఘనపూర్ విద్యార్థులు
> షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పెంచాలి: కడియం
> తప్పుడుగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని NSUI నేతల డిమాండ్
> ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
> సోమేశ్వరాలయానికి అరకిలో వెండి పూర్ణకుంభం అందజేత
Similar News
News January 12, 2026
ఫిబ్రవరి 17 నుంచి పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు: డీఈఓ

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 17 నుంచి 24 వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు అందరూ ఈ షెడ్యూల్ను గమనించి, పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News January 12, 2026
అనంతపురంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

అనంతపురంలోని రూడ్ సెట్ సంస్థలో ఫిబ్రవరి 5 నుంచి మార్చి 7 వరకు నెల రోజుల పాటు మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 19 నుంచి 50ఏళ్ల వయసున్న గ్రామీణ నిరుద్యోగ మహిళలు దీనికి అర్హులు. శిక్షణ కాలంలో వసతి, భోజన సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News January 12, 2026
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

తాను ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన సాయిచరణ్కు 15ఏళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్లుగా భార్యను వదిలేసిన అతను కీసర అహ్మద్ గూడలో ఉంటున్నట్లు తెలుసుకున్న శిల్ప అక్కడికి చేరుకుంది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.


