News February 10, 2025
జగిత్యాల: ఉరేసుకుని యువతి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సందవేని శ్రీవాణి(23) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు ధర్మారంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 5, 2026
వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
News January 5, 2026
అనంతలో ఆలయం తొలగింపు వివాదం.. రంగంలోకి హిజ్రాలు

కోర్టు ఆదేశాలతో అనంతపురంలోని కుక్కలపల్లి కాలనీ వద్ద ఉన్న శ్రీ నరిగమ్మ ఆలయ తొలగింపునకు ఆదివారం రెవెన్యూ, పోలీసులు యత్నించారు. అయితే BJP, VHP నాయకులు నిరసన తెలిపారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విగ్రహాలను కొత్తగా నిర్మించిన ఆలయంలోకి అధికారులు మార్చారు. అయితే BJP నాయకులు హిజ్రాలను రంగంలోకి దింపారు. తరలించిన విగ్రహాలను వారు యథాస్థానానికి చేర్చారు. పూజలు చేస్తూ తరలింపును అడ్డుకున్నారు.
News January 5, 2026
అవయవదానం ఫ్యామిలీకి రూ.లక్ష!

AP: అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాలకు రూ.లక్ష అందజేయాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బలం చేకూరడంతో పాటు అవయవదానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది 93మంది జీవన్మృతుల నుంచి అవయవాలు తీసుకొని 301 మందికి అమర్చినట్లు మంత్రి చెప్పారు.


