News February 10, 2025

రాష్ట్ర గంగపుత్ర సదస్సులో నిర్మల్ జిల్లా విద్యార్థులు

image

హైదరాబాద్‌లో జరుగుతున్న రాష్ట్ర గంగపుత్ర విద్యార్థుల సదస్సులో ఆదివారం రెండో రోజు నిర్మల్ జిల్లా గంగపుత్ర విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యావంతులు పరిష్కరించే విధంగా అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలైన గ్రూప్ 1,2,3 వంటి పోటీ పరీక్షలతో పాటు స్వయం ఉపాధి, కుల వృత్తుల వంటి వాటిలో యువతను ప్రోత్సహించే విధంగా మెలుకువలను అందించారు.

Similar News

News January 11, 2026

నెలాఖరిన కుప్పంలో CM పర్యటన

image

CM చంద్రబాబు జనవరి చివర్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జనవరి 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో CM కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించనున్నారు. మూడు రోజుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1న కుప్పంలో నూతన పెన్షన్లను CM లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.

News January 11, 2026

Bullet Train: ఆలస్యం ఖరీదు ₹88వేల కోట్లు!

image

ఇండియాలో తొలి బుల్లెట్ రైలు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రాజెక్టు నాలుగేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం ఏకంగా 83% పెరిగింది. దాదాపు ₹1.1 లక్షల కోట్లతో అనుమతులు ఇవ్వగా తాజాగా ₹1.98 లక్షల కోట్లకు అంచనా పెరిగింది. ఇప్పటిదాకా ₹85,801 కోట్లు ఖర్చయ్యాయి. సూరత్, బిలిమోరా మధ్య <<18733757>>తొలి విడతలో <<>>2027 ఆగస్టులో ట్రైన్ పట్టాలెక్కనుంది. 508KM మొత్తం ప్రాజెక్టు(ముంబై-అహ్మదాబాద్) 2029 డిసెంబర్‌కు పూర్తి కానుంది.

News January 11, 2026

శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం

image

శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం సాయంత్రం ఆయనను ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. కుటుంబ సభ్యులు వైద్యుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులిటెన్ విడుదల కాలేదు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.