News February 10, 2025

అక్రమ కేసులకు భయపడం: మాజీ మంత్రి కాకాని

image

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిపై దాడులు చేయిస్తున్నారని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ అధికారులను వదిలిపెట్టమని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకానిగోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. గూడూరు మండలం మంగళపూర్‌లో వైసీపీ సానుభూతిపరుడు సతీశ్ యాదవ్‌ను కాకాని పరామర్శించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

Similar News

News March 23, 2026

పార్వతీపురం జిల్లాలో గజరాజుల సంచారం

image

పార్వతీపురం జిల్లా జియ్యమ్మవలస పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా గజరాజులు సంచరిస్తున్నాయి. ప్రస్తుతం ఓల్డ్ బట్టలభద్ర– ఓల్డ్ బిత్రపాడు గ్రామాల మధ్య ఏనుగుల గుంపు తిరుగుతోంది. అయితే సమీప పంట పొలాలకు రైతులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. ఏ క్షణాన ఇవి దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఏనుగుల సంచారంపై సమాచారం అందిస్తూ..అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులుకు హెచ్చరిస్తున్నారు.

News March 23, 2026

ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలి: సీఎం

image

రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఆదివారం సిద్దిపేట(D) నర్మెట సభలో మాట్లాడారు. రైతులు మిల్లెట్స్ ఆర్గానిక్, కాయగూరలు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పామాయిల్ సాగు లాభదాయకని, ఆదాయం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా లాభసాటి వ్యవసాయం చేస్తూ ఆదాయం పెంచుకోవాలన్నారు.

News March 23, 2026

మూలపేట పోర్టుపై రాజకీయ వేడి

image

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలకమైన మూలపేట పోర్టు పనుల్లో డొల్లతనం కనిపిస్తోందని కూటమిపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఇటీవల పోర్టుకు రోడ్డు, రైలు అనుసంధానానికి కేంద్రం 358 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది అభివృద్ధికి పెద్ద పీఠం ఇవ్వనుందని కూటమి పేర్కొనగా..YCP నిర్మాణాలు చకచక జరగడం లేదని MAR30న పోర్టు సందర్శన కార్యక్రమం నిర్వహించనుంది. దీంతో జిల్లాలో అభివృద్ధి పేరుతో రాజకీయ వేడి రాజుకుంటోంది.