News February 10, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3వేల మెజార్టీ రావాలి: జగ్గారెడ్డి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంగారెడ్డి నుంచి 3000 ఓట్ల మెజార్టీ రావాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ధర్మ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. సమావేశంలో TGIIC చైర్ పర్సన్ నిర్మలరెడ్డి, నాయకులు తోపాజి అనంత కిషన్, ఆంజనేయులు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 12, 2026
భద్రాచలం: భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి భారీ విఘాతం కలిగింది. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందిన 108 మంది మావోయిస్టులు రాష్ట్ర DGP అరుణ్ దేవ్ గౌతమ్ ఎదుట లొంగిపోయారు. వీరిచ్చిన సమాచారంతో పోలీసులు జరిపిన గాలింపులో భారీ డంపు బయటపడింది. ఇందులో ₹3.65 కోట్ల నగదు, ₹1.64 కోట్ల విలువైన బంగారంతో పాటు AK-47, LMG వంటి 101 అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు చరిత్రలో ఇది అతిపెద్ద లొంగుబాటు.
News March 12, 2026
విశాఖలో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేశ్ గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విధాల అండగా ఉంటామని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చారు. అయితే విశాఖలో క్యాప్ జెమిని ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ నేడు భేటీ కానున్నారు.


