News February 10, 2025
తూ.గో: మార్చి 8 వరకు పీజీఅర్ఎస్ రద్దు

ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ సెషన్‌లు రద్దు చేశామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు (మార్చి 8) ఈ రద్దు అమలులో ఉంటుందని, అర్జీదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 15, 2025
తూ.గో పోలీస్ గ్రీవెన్స్‌కు 40 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం”లో 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మురళీకృష్ణ అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సంబంధిత పొలీసు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానకి కృషి చేశారు. అర్జీలలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయన్నారు.
News September 15, 2025
రాజమండ్రి: కలెక్టరేట్ PGRSలో 152 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహించరాదని, నిర్ణీత సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి 152 ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
News September 15, 2025
రాజమండ్రి: సెప్టెంబర్ 17 నుంచి ఉచిత వైద్య సేవలు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతులను రాజమండ్రిలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఆవిష్కరించారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.