News February 10, 2025

ఉత్సాహంగా ఉత్తరాంధ్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు

image

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరులో ఆదివారం మోదకొండమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు జరిగాయి. కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా చోడవరం సీడీసీ ఛైర్మన్ శ్రీనివాసరావు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

Similar News

News March 5, 2026

నిర్మల్: ఇంటర్ పరీక్షలు.. 220 మంది గైర్హాజరు

image

నిర్మల్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర గణితం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈవో పరశురాం తెలిపారు. మొత్తం 6,358 మంది విద్యార్థులకు గాను 6,138 మంది హాజరుకాగా, 220 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు నిశ్చింతగా పరీక్షలు రాశారని ఆయన పేర్కొన్నారు.

News March 5, 2026

సిద్దిపేట: ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కే.హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిందన్నారు.

News March 5, 2026

నామినేషన్ వేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

image

తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన వారిద్దరూ తమకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, ఏఐసీసీ పెద్దలకు, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని సింఘ్వీ వ్యాఖ్యానించారు.