News February 10, 2025
శ్రీకాకుళం: ఈ రోజు ఆదిత్యుని ఆదాయం ఎంతంటే..

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం ఆదివారం ఆదాయ వివరాలను ఈవో భద్రాజి వెల్లడించారు. స్వామివారికి టికెట్లు రూపేనా రూ.6,78,600 లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,16,454లు ఆదాయం వచ్చిందన్నారు. ప్రసాదాల రూపంలో రూ.2,68,175లు వచ్చాయన్నారు. మొత్తం రూ. 10,63,229 సమకూరినట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 19, 2026
సిక్కోలులో సైబర్ మోసం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సైబర్ మోసం ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అరసవల్లిలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కె.జయశంకర్, భార్య పుష్పలత ఖాతా నుంచి రూ.2.49 లక్షలు మాయమయ్యాయి. బాధితులు వివరాలు మేరకు ఈనెల 11వ తేదీ రాత్రి బ్యాంకు లావాదేవీల యాప్‌కు సంబంధించి తమ మొబైల్‌కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్ చేయడంతో నగదు డెబిట్ అయినట్లు సందేశాలు రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.
News March 19, 2026
కవిటి: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

కవిటి మండలం నెలవంక పంచాయతీ పరిధిలోని ఒక గ్రామంలో ఉంటున్న ఒక మానసిక వికలాంగురాలిపై నెలవంక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు వారం రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్లిన వ్యక్తి మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కవిటి పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 19, 2026
శ్రీకాకుళం: ప్రయాణికుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

కాశీబుగ్గ రైల్వేస్టేషన్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మార్గంలో వెళ్తున్న ఓ పాసెంజర్‌ను దుండగుడు అడ్డగించి దాడి చేశాడు. అతని బ్యాగ్‌లోని తీసుకొని పారిపోయాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ప్రయాణికుడు గాయాలపాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. స్థానికులు 108లో సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.


