News February 10, 2025
సమస్యలు ఉంటే అర్జీలతో రండి: కడప కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కడప కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై ప్రజలు నేరుగా కలెక్టర్ కార్యాలయంలో తనకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఆహారాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News April 10, 2026
పులివెందుల యువతి గ్రేట్..!

పులివెందుల పట్టణానికి చెందిన అనిలాదేవి, గురుదత్తల కుమార్తె సాయి వర్షిత తాజాగా విడుదలైన SSC CGL ఫలితాల్లో సత్తాచాటారు. ఇన్‌కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమె గతేడాది ఐదు సెంట్రల్ జాబ్స్ సాధించి ఔరా అనిపించారు. న్యాయ శాస్త్రం చదివిన ఐదేళ్లలో నాలుగు బంగారు పతకాలు సాధించడం విశేషం. ఆమెను పలువురు అభినందించారు.
News April 10, 2026
కడప: ముమ్మర వాహన తనిఖీలు.. రూ.49 వేల జరిమానా!

జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 227 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 49,565 జరిమానా వసూలు చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.