News February 10, 2025

బత్తలపల్లి విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

image

విజయవాడలో ఆదివారం రాష్ట్ర స్థాయిలో వేదిక్ మ్యాథ్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వేదిక్ మ్యాథ్స్ లెవెల్-2 విభాగంలో బత్తలపల్లికి చెందిన విద్యార్థిని అద్విక ద్వితీయ బహుమతి గెలుచుకుంది. అనంతరం విశ్వం సీఈవో హరిచరణ్ చేతులపై ప్రశంసా పత్రం, కప్పు అందుకుంది. హైద్రాబాద్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయిందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ తెలిపారు.

Similar News

News December 27, 2025

భద్రాద్రి జిల్లాలో లొంగిపోయిన 300 మంది మావోయిస్టులు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో 2025 సంవత్సరపు వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో నలుగురు మావోయిస్టులను అరెస్టు చేయగా, మరో 300 మంది లొంగిపోయినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని, నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు.

News December 27, 2025

అరకులోయలో VRO భార్య అనుమానాస్పద మృతి

image

అరకులోయలోని సి.కాలనీలో నివాసముంటున్న వాలసి VRO కొండలరావు రెండో భార్య రత్నలమ్మ(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం ఆమె తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటాన్ని మృతురాలి కుమారుడు బాలకృష్ణ గుర్తించారు. వెంటనే అరకులోయ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వేణుగోపాల్ రావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

News December 27, 2025

రేపు రాయచోటి బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ నేతలు

image

రాయచోటిని మదనపల్లిలో కలుపుతున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీనికి నిరసనగా జేఏసీ నేతలు రేపు రాయచోటిలో బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసివేసి నిరసన తెలపాలని కోరారు. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు శివాలయం చెక్‌పోస్ట్ నుంచి పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.