News February 10, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 10, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News September 16, 2025
నేడు భారీ వర్షాలు

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. అటు TGలో వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని IMD తెలిపింది.
News September 16, 2025
మెగా డీఎస్సీ: విజయవాడలో 5వేల మందికి బస

AP: మెగా DSCలో ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు ఈ నెల 19న CM చంద్రబాబు అమరావతిలో నియామక పత్రాలు అందించనున్నారు. దీని కోసం జోన్-1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఈ నెల 18 సాయంత్రానికి సుమారు 5వేల మంది విజయవాడ రానున్నారు. వారికి బస కోసం 13 పాఠశాలలను కేటాయించారు. అటు రాయలసీమలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 16, 2025
క్రమంగా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

దేశంలో 15 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసుండి పనిచేసే అవకాశం ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. కేంద్రం విడుదల చేసిన కార్మిక సర్వే గణాంకాల ప్రకారం.. ఆగస్టులో నిరుద్యోగ రేటు 5.1%గా నమోదైంది. ఇది జులైలో 5.2 శాతంగా, మే, జూన్ నెలల్లో 5.6 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు వరసగా మూడో నెలలో కూడా తగ్గింది. మేలో 5.1% ఉన్న రేటు ఆగస్టులో 4.3 శాతానికి తగ్గింది.