News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై వివరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News November 11, 2025
ఖమ్మం: సదరం స్కామ్.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్

సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో గత రెండేళ్లలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేలడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదిక ఆధారంగా సదరం విభాగానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. స్కామ్‌లో పాలుపంచుకున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను తొలగించి, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 11, 2025
ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియామకం

ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీఈవోగా పనిచేస్తూ సెలవులో ఉన్న జైనీని ఖమ్మం డీఈవోగా నియమించారు. ఇన్‌చార్జ్ డీఈవోగా ఉన్న శ్రీజ స్థానంలో రెండు రోజుల్లో చైతన్య జైనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తిస్థాయి అధికారిని నియమించాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌తో ఈ నియామకం జరిగినట్లు సమాచారం.
News November 11, 2025
ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదంటే?

త్రివిధ తాపాల్లో దైవిక తాపం ఒకటి. ఇది ప్రకృతి శక్తుల వలన సంభవిస్తుంది. అధిక వర్షాలు, కరవు, భూకంపాలు, పిడుగులు, తుఫానులు, గ్రహాచారాల వలన కలిగే బాధలు దీని కిందకి వస్తాయి. ఈ దుఃఖాల నుంచి ఉపశమనం పొందడానికి దైవారాధన, భక్తి, ప్రకృతి పట్ల మనం గౌరవం చూపాలి. యజ్ఞాలు, దానాలు, పవిత్ర నదీ స్నానాలు వంటి ధార్మిక కర్మలను ఆచరించాలి. విధిని అంగీకరించాలి. తద్వారా ఈ దైవిక దుఃఖాలను తట్టుకునే మానసిక శక్తి లభిస్తుంది.


