News February 10, 2025

బాల్కొండ: వరద కాలువలో వ్యక్తి గల్లంతు

image

బాల్కొండ మండలం బుస్సాపూర్ వద్ద ఇందిరమ్మ వరద కాలువలో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వ్యక్తి ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి పోవడంతో నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపి వేశారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్నం వరకు 2,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది.

Similar News

News March 13, 2026

NZB: ‘గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆందోళన వద్దు’

image

వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో గ్యాస్ కొరత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. IDOCలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో వంట గ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నులపై ఈ సమావేశంలో సమీక్షించారు.

News March 13, 2026

NZB: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

రాజీ మార్గమే రాజ మార్గమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో చిన్న చిన్న కేసులు, మైనర్ క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ చలాన్, సివిల్ వివాదాలు సులభంగా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News March 13, 2026

UPDATE: ప్రమాద బస్సులో రామ చిలుకలు.. కొన్ని మృతి..!

image

ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సులో అధికారులు రామచిలుకల పెట్టెను గమనించి బయటకు తీశారు. పెట్టెలో సుమారు 60 రామచిలుకలను కుక్కి ఉంచడంతో ఊపిరాడక 8 మృతి చెందాయి. దీంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటిని నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ కొన్ని చిలుకలను పశువైద్యశాలకు తరలించారు.