News February 10, 2025

మహాదేవపూర్: చెరువులో పడి వ్యక్తి మతి

image

చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మహాదేవపూర్ మండలంలో జరిగింది. పోలీసుల కథనమిలా.. మండల కేంద్రంలోని ఎర్రచెరువుకు మేడం నాగేందర్ (46) బహిర్భూమి కోసం వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. మృతుడిది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి అని తెలిపారు. మృతుడి భార్య అనితా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Similar News

News March 7, 2026

రఘురామ కేసు: సమాధానాలు దాటవేసిన IPS సునీల్?

image

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో IPS అధికారి సునీల్ నాయక్ మూడో రోజు విచారణ ముగిసింది. గుంటూరు CCS పోలీస్ స్టేషన్‌లో అధికారులు 7గంటల పాటు ప్రశ్నించారు. రఘురామను గుంటూరుకు తరలించిన టైమ్‌లో అక్కడికి రావాల్సిన అవసరం ఏముందని అడిగిన ప్రశ్నలకు సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రేపు, ఎల్లుండి కూడా ఈ విచారణ కొనసాగుతుందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

News March 7, 2026

గోల్డ్ రింగ్, పెళ్లికి 8గ్రా. బంగారం.. సాధ్యమేనా?

image

TNలో ఎన్నికల వేళ TVK చీఫ్ విజయ్ ప్రకటించిన <<19322449>>హామీల<<>>పై చర్చ జరుగుతోంది. పిల్లలు పుడితే గోల్డ్ రింగ్, అమ్మాయి పెళ్లికి 8గ్రా. బంగారం ఇస్తామని ఇవాళ ప్రకటించారు. మిగతా వాటిని అటుంచితే బంగారం హామీ హాట్ టాపిక్ అయింది. ఇది వినడానికి బాగానే ఉన్నా 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షన్నరకు పైగా ఉన్న తరుణంలో అమలు సాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హామీలకు హద్దులుండవా? అని నెట్టింట చర్చ జరుగుతోంది. మీరేమంటారు?

News March 7, 2026

రేపు వరుణ్ ఆడతాడా? సూర్య రెస్పాన్స్ ఇదే..

image

T20 WC: టీమ్‌ఇండియా స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. దీంతో ఫైనల్లో అతణ్ని తప్పిస్తారనే చర్చ జరుగుతోంది. దీనిపై కెప్టెన్ సూర్య స్పందించారు. ‘వరుణ్ ఫామ్‌పై మాకు ఆందోళన లేదు. ఇది టీమ్ స్పోర్ట్. అతని ఒక్కడి పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించడం లేదు. అతడు వరల్డ్ నం.1 బౌలర్. టీమ్‌ను ఎలా గెలిపించాలో అతనికి తెలుసు’ అంటూ వరుణ్‌ను వెనకేసుకొచ్చారు. జట్టులో మార్పులు రేపే తెలుస్తాయన్నారు.