News February 10, 2025

ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రి బాలుడు

image

హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం న్యూ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రికి చెందిన బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థి సత్తా చాటారు. అండర్‌14 కటాస్ విభాగంలో జి. సాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్, బిఎంఆర్ అకాడమీ నిర్వాహకులు సంతోష్, మాస్టర్ కర్ర వెంకటేష్, శశి అభినందించారు.

Similar News

News March 30, 2026

రిలేషన్షిప్‌లో ఈ 3 తప్పులు అస్సలు చేయకండి!

image

మనుషుల మధ్య బంధాలు తెగిపోవడానికి పెద్ద గొడవలు అక్కర్లేదని, చిన్న అలవాట్లే చాలంటున్నారు సైకాలజిస్టులు. ముఖ్యంగా 3 అంశాలు బంధాన్ని సైలెంట్‌గా నాశనం చేస్తాయని తెలిపారు. ‘మనసు విప్పి మాట్లాడకపోవడం, గత తప్పులను పదేపదే ఎత్తిచూపడం, భాగస్వామి భావాలను నిర్లక్ష్యం చేయడం వంటివి బంధాన్ని బలహీనపరుస్తాయి. వీటివల్ల ప్రేమ తగ్గి దూరం పెరుగుతుంది. ఒకరినొకరు గౌరవించుకుంటేనే ఏ బంధమైనా నిలబడుతుంది’అని సూచిస్తున్నారు.

News March 30, 2026

TU: HIV/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

image

టీయూలో రెడ్ రిబ్బన్ క్లబ్, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) సెల్ ఆధ్వర్యంలో HIV/AIDS పై విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. ముఖ్యవక్తగా వచ్చిన డా.మురళీకృష్ణ మాట్లాడుతూ.. HIV/AIDS వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, అపోహలపై వివరించారు. DPM సుధాకర్ మాట్లాడుతూ.. ఏఆర్టీ ద్వారా వైద్యం పొందుతున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు.

News March 30, 2026

KMR: జయంతి ఉత్సవాలపై సన్నాహక భేటీ

image

అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై APR 1న మధ్యాహ్నం 4 గంటలకు కామారెడ్డి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సన్నాహక సమావేశం జరగనుంది. కలెక్టర్, అదనపు కలెక్టర్ల అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని ఎస్సీ సంఘాల నాయకులు హాజరై తమ సూచనలు అందించాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లు, సమన్వయంపై చర్చించనున్నారు.