News February 10, 2025
హత్నూర: దౌల్తాబాద్ విద్యార్థుల ప్రతిభ
హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఆదివారం నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ 9వ తరగతి విద్యార్థులు నవాజ్, భవానీ, అన్విత క్రియ ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజాస్టర్ నమూనాకు రూ. 30 వేల బహుమతి అందుకున్నారు. వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయుడు వెంకటేశంను కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందించారు.
Similar News
News February 11, 2025
చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్‌కు 3.7B ఏళ్లు?
చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ 3.7 బిలియన్ ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. హై రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ సెంటర్, అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం ‘శివశక్తి’ పాయింట్‌ను (69.37°S, 32.32°E) మ్యాప్ చేసింది. అక్కడ చిన్న బండరాళ్లు, రాతి శకలాలున్నాయని పేర్కొంది.
News February 11, 2025
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..!
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో పీఆర్టీయూ ప్రతినిధులు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే వినియోగించాలి. ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థి పేరుకు ముందు 1 అంకె వేయాలి. తర్వాత 2, 3, 4, 5 ఇలా ఎన్ని అంకెలైనా వేయవచ్చు. 1 అంకె వేయకుండా మిగిలిన అంకెలు వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. టిక్కు పెట్టినా ఓటు చెల్లుబాటు కాదు.
News February 11, 2025
మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు: కమిషనర్
AP: మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 పెంచినట్లు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.