News February 10, 2025

26 ఏళ్ల క్రితం.. ఢిల్లీకి 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు!

image

ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. అయితే చివరిసారిగా (1993-1998) ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ముగ్గురు సీఎంలు పాలించారు. తొలుత మదన్‌లాల్ ఖురానా సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో 27 నెలలకే రాజీనామా చేశారు. ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉల్లి ధరలపై విమర్శలతో 31 నెలల్లో రిజైన్ చేశారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ 52 రోజులపాటు సీఎంగా ఉన్నారు.

Similar News

News February 11, 2025

ఏపీలో అక్షరాస్యత రేటు ఎంతంటే?

image

APలో అక్షరాస్యత రేటు 67.5%గా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత మూడేళ్లలో అక్షరాస్యత రేటు పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎంపీ తనూజారాణి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. 2023-24లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత 77.5%గా ఉండగా, ఏపీలో 67.5%గా ఉందన్నారు. పీఎం కౌశల్ యోజన కింద రాష్ట్రానికి రూ.48.42కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

News February 11, 2025

ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు!

image

TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు సోమవారం ఖమ్మంలో 35, హైదరాబాద్‌లో 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.

News February 11, 2025

చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్‌కు 3.7B ఏళ్లు?

image

చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ 3.7 బిలియన్ ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. హై రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ సెంటర్, అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం ‘శివశక్తి’ పాయింట్‌ను (69.37°S, 32.32°E) మ్యాప్ చేసింది. అక్కడ చిన్న బండరాళ్లు, రాతి శకలాలున్నాయని పేర్కొంది.

error: Content is protected !!