News February 10, 2025
బెల్లంపల్లి: బార్ దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739096889283_51297756-normal-WIFI.webp)
బెల్లంపల్లి SRR బార్లో తాండూర్‌కు చెందిన బండారి వంశీ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసిన ముగ్గురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అల్లి సాగర్, రత్నం సోమయ్య, మామిడి అన్నమయ్యలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు CIవివరించారు.
Similar News
News February 11, 2025
ఛాంపియన్‌గా కర్నూలు జిల్లా జట్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739198873780_50299483-normal-WIFI.webp)
యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా పెద్దపాడులోని ఓ పాఠశాల నందు నిర్వహిస్తున్న 1వ రాష్ట్ర స్థాయి యోగా లీగ్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేఎంసీ డిప్యూటీ మేయర్ రేణుక ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించారు. కర్నూలు, అనంతపూర్, నంద్యాల జిల్లా జట్లు వరుసగా మూడు స్థానాలలో నిలిచాయి.
News February 11, 2025
ఏపీలో అక్షరాస్యత రేటు ఎంతంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739229009390_893-normal-WIFI.webp)
APలో అక్షరాస్యత రేటు 67.5%గా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత మూడేళ్లలో అక్షరాస్యత రేటు పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎంపీ తనూజారాణి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. 2023-24లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత 77.5%గా ఉండగా, ఏపీలో 67.5%గా ఉందన్నారు. పీఎం కౌశల్ యోజన కింద రాష్ట్రానికి రూ.48.42కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
News February 11, 2025
ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738636853991_1226-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు సోమవారం ఖమ్మంలో 35, హైదరాబాద్‌లో 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.