News February 10, 2025
కాగజ్నగర్: మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

కాగజ్నగర్ సమీపంలోని పెద్దవాగు వద్ద మినీ మేడారం (సమ్మక్క, సారలమ్మ) జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 15 వరకు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్, రాజయ్య, పిరిసింగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 7, 2026
ఫీజుల పేరిట హాల్ టికెట్లు ఆపితే చర్యలు: డీఈవో

పదో తరగతి విద్యార్థుల హాల్ టికెట్లను ఫీజుల బకాయిల నెపంతో నిలిపివేయవద్దని డీఈవో గిరిరాజ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను కూడా పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తామన్నారు.
News March 7, 2026
ఒక్క ఓటీపీతో రూ.2.90 లక్షలు మాయం

అమలాపురంలో బ్యాంక్ రుణం పేరుతో జరిగిన ఆన్‌లైన్ మోసంలో బావ, బావమరిది రూ.2.90 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. కొంకాపల్లికి చెందిన వెంకటేశ్, దుర్గాప్రసాద్‌ను సాయికుమార్ అనే వ్యక్తి నమ్మించి ఓటీపీలు అడిగి క్రెడిట్ కార్డు ద్వారా నగదు దోచుకున్నాడు. దీనిపై టౌన్ CI వీరబాబు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News March 7, 2026
సంగారెడ్డి: భారీ గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద పటాన్‌చెరు పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల గంజాయిని తనిఖీల్లో భాగంగా సీజ్ చేశారు. ఈ కేసులో విశాల్, అనిల్, మణికుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


