News February 10, 2025
నేడు ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం

భారత రక్షణశాఖ నేటి నుంచి ఈనెల 14 వరకు ‘ఏరో ఇండియా షో 2025’ను నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్‌గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.
Similar News
News November 12, 2025
రాజమౌళి-మహేశ్ బాబు మూవీ.. ప్రియాంక పోస్టర్ రిలీజ్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియాంకా చోప్రా పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె చీర ధరించి, చేతిలో గన్ పట్టుకుని అగ్రెసివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారని జక్కన్న తెలిపారు. Welcome back, Desi Girl! అని ట్వీట్ చేశారు.
News November 12, 2025
టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా, పాక్‌లో అయితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై US ఎంబసీ ట్వీట్ చేసింది. అదీ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత ఓ పోస్టుతో మమ అనిపించింది. పాక్‌లో దాడులు జరిగితే మాత్రం వెంటనే స్పందించి మొసలి కన్నీరు కార్చింది. టెర్రరిజంపై పోరులో పాకిస్థాన్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ట్వీట్ చేసింది.
News November 12, 2025
అలర్ట్.. వచ్చే వారం రోజులు జాగ్రత్త!

TG: రాబోయే వారం రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఆస్కారం ఉందని తెలిపింది. దీంతో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో కూడిన సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందవచ్చని హెచ్చరించింది. గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారు, 5 ఏళ్ల లోపు పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


